ఇంతవరకూ ఇలాంటి పాత్ర చేయలేదు: తమన్నా
- తెలుగు .. తమిళ భాషల్లో 'యాక్షన్'
- ఎల్లుండి రెండు భాషల్లోను విడుదల
- కమెండో గా కనిపిస్తానంటున్న తమన్నా
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. 'యాక్షన్' సినిమాలో విశాల్ జోడీగా నటించాను. ఆయనతో పాటు నేను కూడా కమెండో ఆఫీసర్ గానే చేశాను. ఈ సినిమాలో నేను యాక్షన్ సీన్స్ .. ఛేజింగ్ సీన్స్ లోను కనిపిస్తాను. ఈ తరహా పాత్రను చేయడం థ్రిల్లింగ్ గా అనిపించింది. ఇక ఫైట్లు మాత్రమే కాదు .. విశాల్ కి నాకూ మధ్య రొమాంటిక్ సాంగ్స్ కూడా ఆకట్టుకునేలా వుంటాయి. సుందర్ సి. దర్శకత్వం వహించిన ఈ సినిమా, నా కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చింది.