టీటీడీపీ ఉపాధ్యక్షురాలు అన్నపూర్ణమ్మ పార్టీకి గుడ్ బై
- బీజేపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే
- కుమారుడు మల్లికార్జున్ కూడా తల్లి బాటలోనే
- బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్న తల్లీతనయులు
1994, 2009లలో ఆమె ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018 ఎన్నికల్లో పోటీచేయలేదు. కాగా, బాల్కొండ నియోజకవర్గానికి పార్టీ ఇంఛార్జీగా పనిచేస్తున్న అన్నపూర్ణమ్మ కుమారుడు మల్లికార్జున్ కూడా తన పదవిని వీడారు. ఈరోజు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో తన తల్లితో కలిసి ఆయన బీజేపీలో చేరనున్నారు.