'మజిలీ' దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ దేవరకొండ
- విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'వరల్డ్ ఫేమస్ లవర్'
- తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'హీరో'
- త్వరలో 'ఫైటర్' సెట్స్ పైకి
ఈ నేపథ్యంలోనే పూరి జగన్నాథ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి విజయ్ దేవరకొండ సిద్ధమవుతున్నాడు. త్వరలోనే 'ఫైటర్' సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఆ తరువాత సినిమా 'నిన్నుకోరి' .. 'మజిలీ' చిత్రాల దర్శకుడు శివ నిర్వాణతో చేయనున్నాడు. తాజా ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. విజయ్ దేవరకొండ 'హీరో' .. 'ఫైటర్' సినిమాలను పూర్తి చేసేలోగా, తను సిద్ధంగా వుండటం కోసం శివ నిర్వాణ చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నాడని సమాచారం.