కార్తీ 'ఖైదీ' 50 కోట్ల క్లబ్ లోకి చేరడం ఖాయమట!
- ఈ నెల 25న వచ్చిన 'ఖైదీ'
- రెండు రోజుల్లో 14 కోట్ల వసూళ్లు
- ఫుల్ ఖుషీ అవుతున్న అభిమానులు
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలి రెండు రోజుల్లో 14 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ఈ వారంలో ఈ సినిమాకి పోటీగా నిలిచే సినిమాలు తెలుగులో ఏమీ రావడం లేదు. అందువలన ఇక్కడ వసూళ్ల జోరు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం ఖాయమనే అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. చాలాకాలం తరువాత కార్తీకి హిట్ పడినందుకు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.