'కార్తికేయ 2'కి రెడీ అవుతున్న నిఖిల్
- గతంలో హిట్ కొట్టిన 'కార్తికేయ'
- త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న సీక్వెల్
- వచ్చేనెలలో 'అర్జున్ సురవరం' విడుదల
కొంతకాలంగా ఇటు చందు మొండేటికిగానీ .. అటు నిఖిల్ కి గాని హిట్ పడలేదు. దాంతో గతంలో తమ ఇద్దరికీ హిట్ ఇచ్చిన 'కార్తికేయ' కంటెంట్ తో మరోసారి విజయాన్ని అందుకోవాలనే ఆశతో వున్నారు. ఈ సీక్వెల్ తో వాళ్ల ఆశ నెరవేరుతుందేమో చూడాలి. ఇక కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న నిఖిల్ సినిమా 'అర్జున్ సురవరం' వచ్చేనెలలో ప్రేక్షకుల ముందుకు రానుందనే వార్తలు వినిపిస్తున్నాయి.