డిగ్రీ పట్టా కోసం... 8 మంది డూప్ లను తయారు చేసిన బంగ్లా ఎంపీ!
- అవామీ లీగ్ ఎంపీ తమన్నా సుస్రత్
- 13 పరీక్షలు రాసేందుకు డూప్ ల వినియోగం
- విషయం బయటకు రావడంతో ఎంపీని సస్పెండ్ చేసిన వర్శిటీ
కాగా, అవామీ లీగ్ పార్టీకి చెందిన తమన్నా నుస్రత్ బంగ్లాదేశ్ ఓపెన్ యూనివర్సిటీలో బీఏ విద్యను అభ్యసిస్తున్నారు. తాను రాయాల్సిన మొత్తం 13 సబ్జెకుల పరీక్షల కోసం తన మాదిరిగానే ఉన్న 8 మందిని ఆమె రంగంలోకి దించగా, 'నాగరిక్ టీవీ' అనే చానెల్ విషయాన్ని బయటపెట్టింది. ఈ డూప్ మహిళలు పరీక్షలు రాస్తుంటే, ఎంపీ అనుచరులు కాపలాగా ఉండటం గమనార్హం.