సంక్రాంతి బరిలో బాలయ్య మూవీ లేనట్టే!
- యాక్షన్ ఎంటర్టైనర్ గా బాలకృష్ణ మూవీ
- కథానాయికలుగా సోనాల్ - వేదిక
- డిసెంబర్ 3వ వారంలో విడుదల
అందువలన ఈసారి కూడా సంక్రాంతికి ఆయన సినిమా ఉంటుందని అభిమానులు ఆశించారు. అయితే ఈ సంక్రాంతికి గట్టిపోటీ వుంది. మహేశ్ బాబు 'సరిలేరు నీ కెవ్వరు' .. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సంక్రాంతికి బరిలోకి దిగనున్నాయి. ఇక రజనీ 'దర్బార్' కూడా రంగంలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 3వ వారంలో ప్రేక్షకుల ముందుకు వెళ్లాలని బాలకృష్ణ భావించినట్టుగా సమాచారం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.