గుట్టలుగా సొత్తు... విస్తుపోయే నిజాలు: 'కల్కి' మాయాజాలం
- దాడుల్లో భారీగా నగదు, బంగారం గుర్తింపు
- రహస్య ప్రాంతంలో పది కోట్ల కరెన్సీ, బంగారం
- దేనిపైనా నోరు విప్పని ఐటీ అధికారులు
ఆశ్రమానికి ఎక్కడెక్కడ భూములున్నాయన్న విషయంపై కూడా కూపీ లాగారు. ఆశ్రమంపై దాడులు ప్రారంభంకాగానే అధికారుల కళ్లు గప్పి ఓ వాహనంలో తరలించేందుకు ప్రయత్నించిన రూ.45 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
అలాగే, ఆశ్రమంలో నగదు, బంగారం దాచే ఓ కీలక ప్రాంతాన్ని గుర్తించారు. అక్కడి నుంచి భారీ మొత్తంలో బంగారం కడ్డీలు, దేశవిదేశాల కరెన్సీ రూ.10 లక్షల వరకు గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే ఏ అంశంపైనా అధికారులు నోరు మెదపడం లేదు.
అన్ని రూపాల్లో స్వాధీనం చేసుకున్న సొత్తు, కీలకపత్రాలు, హార్డ్ డిస్క్‌లు ఈరోజు చెన్నైకి తరలించనున్నారు. అక్కడి అధికారులే ఇందుకు సంబంధించిన వివరాలు అందిస్తారని తెలుస్తోంది.