'జాను' నా కెరియర్లో చెప్పుకోదగిన పాత్ర అవుతుంది: సమంత
- తమిళంలో హిట్ కొట్టిన '96' మూవీ
- షూటింగు పూర్తి చేసుకున్న తెలుగు రీమేక్
- తమిళంలో త్రిష చేసిన పాత్రలో సమంత
"ఇంతవరకూ నేను చేసిన పాత్రలు ఒక ఎత్తు .. ఈ సినిమాలోని 'జాను' పాత్ర ఒక ఎత్తు. అందువలన ఈ పాత్రను ఛాలెంజింగ్ గా తీసుకుని చేశాను. కచ్చితంగా ఇది నా కెరియర్లో చెప్పుకోదగిన పాత్ర అవుతుంది. విడుదల తరువాత ఈ సినిమాను చూసిన వాళ్లంతా ఇదే మాట చెబుతారనే నమ్మకం వుంది. ఇంత మంచి టీమ్ తో కలిసి పనిచేసినందుకు నాకు చాలా సంతోషంగా వుంది" అంటూ చెప్పుకొచ్చింది.