బిగ్ బాస్-3... ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్న వితిక... ముగ్గురి మెడపై కత్తి!
- ఎలిమినేషన్ జాబితాలో వరుణ్ సందేశ్
- రాహుల్ సిప్లిగంజ్, మహేశ్ విట్ట కూడా
- మహేశ్ వెళ్లిపోతాడంటున్న సోషల్ మీడియా
ఇక సోమవారం నాడు నామినేషన్స్ కోసం బిగ్ బాస్ పార్కింగ్ టాస్క్ ను ఇవ్వగా, ఈ ముగ్గురితో పాటు వితిక కూడా టాస్క్ ను పూర్తి చేయడంలో విఫలం అయింది. అయితే, గత వారంలో ఆమె, బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ ను సొంతం చేసుకోవడంతో, దాన్ని ఉపయోగించుకుని వితిక నామినేషన్స్ నుంచి తప్పించుకుంది. మెడాలియన్ వాడి సేవ్ అవుతారా? లేకుంటే నామినేషన్స్ లో ఉంటారా? అన్న బిగ్ బాస్ ప్రశ్నకు, తాను సేవ్ అవుతానని వితిక చెప్పడంతో, మిగతా ముగ్గురే నామినేషన్స్ లో ఉన్నారని బిగ్ బాస్ ప్రకటించారు.
ఇక పార్కింగ్ టాస్క్ నాలుగో రౌండ్ లో శివజ్యోతి కిందపడి, గాయపడగా, వెంటనే స్పందించిన బిగ్ బాస్, ఓ వైద్యుడిని హౌస్ లోనికి పంపించాడు. శివజ్యోతి కాలు బెణికిందని సమాచారం.