హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి సినిమా నుంచి ఫస్టులుక్
- హాస్య నటుడిగా శ్రీనివాస్ రెడ్డికి మంచి గుర్తింపు
- దర్శక నిర్మాతగా తొలి ప్రయత్నం
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
పూర్తి హాస్యరసభరితంగా ఆయన ఈ సినిమాను రూపొందించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఆయన ఫస్టులుక్ ను విడుదల చేశాడు. శ్రీనివాసరెడ్డితో పాటు ఈ సినిమాలో షకలక శంకర్ .. సత్య ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. 'మంచి రసగుల్లా లాంటి సినిమా' అంటూ వదిలిన ఈ పోస్టర్లో ఈ ముగ్గురూ డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.