దసరా కానుకగా బాలయ్య మూవీ నుంచి టీజర్
సోనాల్ చౌహాన్ - వేదిక కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమా, తదుపరి షెడ్యూల్ షూటింగును హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. అక్టోబర్ 5వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ షూటింగ్ మొదలుకానుంది. బాలకృష్ణతో పాటు ప్రధాన పాత్రధారులు పాల్గొనగా కొన్ని కీలకమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు. ప్రకాశ్ రాజ్ .. జయసుధ .. భూమిక పాత్రలు ఈ సినిమాలో హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. చిరంతన్ భట్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ కానుందని చెబుతున్నారు. దసరా కానుకగా ఈ సినిమా నుంచి టీజర్ ను వదలనున్నారు.