'సైరా' సెన్సార్ పూర్తి.. రిలీజ్ కి సర్వం సిద్ధం
- భారీ బడ్జెట్ చిత్రంగా 'సైరా'
- వారం ముందే సెన్సార్ పూర్తి
- U/A సర్టిఫికెట్ మంజూరు
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఒక్క కట్ కూడా చెప్పకుండా ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ను మంజూరు చేయడం ఒక విశేషం అయితే, విడుదలకు వారం రోజుల ముందుగానే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోవడం మరో విశేషం. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాలో తమన్నా .. అనుష్క ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ ముగ్గురికి విపరీతమైన క్రేజ్ వున్న సంగతి తెలిసిందే.