అప్పును కూడా ఆదాయంగా చూపిన ఘనుడు కేసీఆర్... అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ని చేయాలి: లక్ష్మణ్ విమర్శలు
- కేసీఆర్ పై ధ్వజమెత్తిన తెలంగాణ బీజేపీ చీఫ్
- అసెంబ్లీలో కేసీఆర్ చెప్పినవి పచ్చి అబద్ధాలని వెల్లడి
- తెలంగాణ కోసం 1990లోనే బీజేపీ పోరాడిందన్న లక్ష్మణ్
1990లోనే తెలంగాణ కోసం బీజేపీ పోరాటం చేసిందని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ ను వ్యక్తిగతంగా దూషించిన చరిత్ర కేసీఆర్ దని మండిపడ్డారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, కోదండరాంలను కూడా అవమానించారని అన్నారు. రాష్ట్రంలో పాలన టీఆర్ఎస్ దే అయినా, ఎంఐఎం అజెండా కొనసాగుతోందని లక్ష్మణ్ విమర్శించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ కు పీఏసీ పదవి ఇవ్వడం అనైతికం అని అభిప్రాయపడ్డారు.