మెగాస్టార్ తో కలిసి నటించిన ప్రతి నిమిషం జీవితాంతం గుర్తుండిపోతుంది: కన్నడ నటుడు సుదీప్
- 'ఈగ' సినిమాతో తెలుగు తెరకి సుదీప్ పరిచయం
- అనువాద చిత్రంగా 'పహిల్వాన్' విడుదల
- చిరంజీవికి తగిన చిత్రం 'సైరా'
ఈ సినిమాను గురించి ఆయన స్పందిస్తూ .. "చిరంజీవి వంటి గొప్ప నటుడు 'సైరా' వంటి ప్రతిష్ఠాత్మక చిత్రం చేయవలసిందే. ఈ సినిమాను చిరంజీవి తనయుడే నిర్మించడం మరో విశేషం. ఈ సినిమాలో నేను 'అవుకు రాజు' పాత్రను పోషించాను. ఇది చాలా మంచి పాత్ర .. అందువలన ఏ ఆర్టిస్ట్ చేసినా బాగానే ఉంటుంది. కానీ అవకాశం నాకు దక్కడం అదృష్టం. చిరంజీవి పక్కన నిలబడితే చాలని అనుకున్న నాకు, ఆయనతో కలిసి నటించే అవకాశం దొరికింది. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆయనతో కలిసి నటించిన ప్రతి నిమిషం నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది" అని చెప్పుకొచ్చాడు.