50వ చిత్రం చేస్తున్న నిత్యా మీనన్!
- ప్రతిభ కలిగిన నటిగా మంచి గుర్తింపు
- ఇంతవరకూ 49 సినిమాలు పూర్తి
- ఈ పాత్ర ప్రత్యేకమన్న నిత్యా మీనన్
వైవిధ్యభరితమైన కథాకథనాలతో ఈ సినిమా సాగనుంది. కథ అంతా కూడా నిత్యామీనన్ పాత్రను ప్రధానంగా చేసుకునే ముందుకు వెళుతుంటుంది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి 'ఆరం తిరుకల్పన' అనే టైటిల్ ను ఖరారు చేశారు. కారిడార్ 6 ఫిల్మ్స్ వారు నిర్మించే ఈ సినిమాకి అజయ్ దేవలోక దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా సంఖ్యా పరంగానే కాదు, పాత్ర పరంగా కూడా తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందని నిత్యామీనన్ భావిస్తోంది.