కర్నూల్ వేదికగా 'సైరా' ప్రీ రిలీజ్ ఈవెంట్?
- చిరూ ప్రతిష్ఠాత్మక చిత్రంగా 'సైరా'
- ముఖ్య అతిథులుగా అమితాబ్ - రజనీ
- అక్టోబర్ 2న భారీస్థాయిలో సినిమా విడుదల
ఇప్పటికే అక్కడికి సంబంధించిన అనుమతుల తాలూకు పనులను పూర్తి చేశారట. ఇక వేదిక ఏర్పాటు పనులు మొదలుకానున్నాయని అంటున్నారు. అమితాబ్ - రజనీ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చిరంజీవి అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకకి తరలి వచ్చే అవకాశం వుంది. ఆ తాకిడిని తట్టుకునే స్థాయిలో ఏర్పాట్లను చేపడుతున్నటుగా చెబుతున్నారు. ఈ మెగా ఈవెంట్ తరువాత, ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వివిధ ప్రాంతాల్లో చిరంజీవి పర్యటనలను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది.