సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- మణిరత్నం చిత్రంలో త్రిషకు ఛాన్స్
- ఎన్టీఆర్, చరణ్ లకు భారీ పారితోషికం
- షూటింగు ప్రారంభిస్తున్న శేఖర్ కమ్ముల
* ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని భారీ ఎత్తున రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్, చరణ్ లు భారీ ఎత్తున పారితోషికం అందుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒక్కొక్కరు సుమారుగా 25 కోట్లు తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.
* శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించే తాజా చిత్రం షూటింగ్ నేటి నుంచి జరుగుతుంది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని క్రిస్మస్ పండుగకి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.