కాణిపాకం వరసిద్ధి వినాయకుడికి బంగారు రథం!
- ఏపీ ప్రభుత్వం తరపున బంగారు రథం చేయిస్తున్నాం
- ఇందుకోసం రూ.6 కోట్లు వెచ్చిస్తాం
- టీటీడీ ఆధ్వర్యంలో రథం తయారు: మంత్రి వెల్లంపల్లి
సెప్టెంబర్ 2 నుంచి 22 వరకు కన్నుల పండువగా వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులు, యాత్రికులకు వసతి, తాగు నీరు సమకూర్చడంతో పాటు దేవాలయాల పరిశుభ్రతను పాటించాలని కాణిపాకం దేవస్థానం ఈవో, అధికారులను మంత్రి ఆదేశించారు. కాణిఫాకం వరసిద్ధి వినాయకుడికి తయారు చేసే బంగారు రథం నమూనా చిత్రం క్రింది విధంగా ఉండనున్నట్టు సమాచారం.