విజయ్ దేవరకొండ సినిమా టైటిల్ ఇదే
- స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ
- సొంత బ్యానర్ తో నిర్మాతగాను రంగంలోకి
- విభిన్నమైన కాన్సెప్టుతో తొలి ప్రయత్నం
ఈ సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. హీరో .. హీరోయిన్ అని కాకుండా, ప్రధాన పాత్రల కలయికగా కనిపిస్తుంది. తరుణ్ భాస్కర్ .. అనసూయ ముఖ్యమైన పాత్రలను పోషించనున్నారు. తాజాగా ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేశారు. 'మీకు మాత్రమే చెప్తా' అనే టైటిల్ ను సెట్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.