సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాను: హీరో ప్రిన్స్
- 'బిగ్ బాస్' వలన నేనేంటనేది జనానికి తెలిసింది
- రెండు సినిమాలకి సైన్ చేశాను
- రెండు వెబ్ సిరీస్ లు చేస్తున్నానన్న ప్రిన్స్
సరైన హిట్ కొట్టాలనే ఉద్దేశంతో కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. రెండు సినిమాలకి సైన్ చేశాను .. రెండు వెబ్ సిరీస్ లు చేస్తున్నాను. ఇటీవల కాలంలో వెబ్ సిరీస్ లు జనంలోకి బాగా వెళుతున్నాయి. అందువలన ఒక వైపున సినిమాలు చేస్తూనే మరో వైపున వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ వెళ్లాలని నిర్ణయించుకున్నాను. గతంలో ఒకసారి హోస్ట్ గా కూడా చేశాను. ఆ రోజుల్లో నా మిగతా పనులకి సంబంధించిన ప్లానింగ్ దెబ్బతింది. అందువలన ఎప్పుడైనా ఒకసారి తప్ప కంటిన్యూగా హోస్టింగ్ చేయదలచుకోలేదు" అని చెప్పుకొచ్చాడు.