బన్నీ తాజా సినిమా టైటిల్ గా 'వైకుంఠపురంలో'?
- త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ
- కీలకమైన పాత్రలో టబు
- సంక్రాంతికి విడుదల
ఈ సినిమాకి 'వైకుంఠపురంలో' అనే టైటిల్ ను అనుకున్నారనేది తాజా సమాచారం. ఇదే టైటిల్ ను ప్రకటించే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఆగస్టు 15వ తేదీన ఈ విషయంలో స్పష్టత రానుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో 'టబు' ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఇటీవలే షూటింగులో ఆమె జాయిన్ అయింది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.