'డియర్ కామ్రేడ్' తొలిరోజు వసూళ్లు
- నిన్ననే విడుదలైన 'డియర్ కామ్రేడ్'
- తొలి రోజు షేర్ 7.49 కోట్లు
- పోటీ లేకపోవడం కలిసొచ్చే అంశం
తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజున ఈ సినిమా 7.49 కోట్ల షేర్ ను వసూలు చేసింది. తెలంగాణలో విజయ్ దేవరకొండ క్రేజ్ మరింత ఎక్కువగా ఉంటుంది. అందువలన ఒక్క నైజామ్ ఏరియాలోనే నిన్న ఒక్క రోజునే ఈ సినిమా 3 కోట్లకి పైగా షేర్ ను రాబట్టింది. శని .. ఆదివారాల్లో వసూళ్లు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చేవారం వరకూ మరే సినిమా బరిలో లేకపోవడం, ఈ సినిమాకి కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.