వరద నీటిలో టిక్‌టాక్ చేయబోయి.. ఉద్ధృతికి కొట్టుకుపోయిన యువకుడు!
- ప్రాణాలు పోతున్నా తగ్గని టిక్‌టాక్ పిచ్చి
- వరద నీటిలో టిక్‌టాక్ చేసేందుకు వెళ్లిన అప్జల్
- మొదట డైవ్ చేసిన అఫ్జల్ స్నేహితుడు
మూడు రోజుల క్రితం అద్దావ్‌పూర్‌కి చెందిన అఫ్జల్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి టిక్‌టాక్ చేసేందుకు వరద నీటి వద్దకు వెళ్లాడు. మొదట అప్జల్ స్నేహితుడు నీటిలో డైవ్ చేయగా, ఆ తరువాత అఫ్జల్ కూడా దూకాడు. అయితే, వరద ఉద్ధృతి కారణంగా అప్జల్ కొట్టుకుపోయాడు. వెంటనే అతడి స్నేహితుడు అధికారులకు సమాచారం ఇవ్వగా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి గాలింపు చేపట్టింది. నేడు సహాయక సిబ్బందికి అప్జల్ మృతదేహం దొరికింది.