బాలకృష్ణ కొత్త సినిమాకి రంగం సిద్ధం .. బ్యాంకాక్ లో షూటింగ్
- మరోసారి కేఎస్ రవికుమార్ తో బాలకృష్ణ
- వచ్చేనెల 7 నుంచి రెగ్యులర్ షూటింగ్
- నాయికలుగా సోనాల్ చౌహాన్ - వేదిక
ఆగస్టు 7వ తేదీన ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలెట్టనున్నారనేది తాజా సమాచారం. తొలి షెడ్యూల్ ను బ్యాంకాక్ లో ప్లాన్ చేశారట. ప్రధాన పాత్రధారుల కాంబినేషన్లో అక్కడ కొన్ని సన్నివేశాలను .. నాయకా నాయికలపై పాటలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో కథానాయికలుగా సోనాల్ చౌహన్ .. వేదికల పేర్లు వినిపిస్తున్నాయి.