త్రివిక్రమ్ తదుపరి సినిమా ఎన్టీఆర్ తోనే!
- బన్నీ హీరోగా త్రివిక్రమ్ సినిమా
- సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు
- గతంలో హిట్ గా నిలిచిన 'అరవింద సమేత'
వెంకటేశ్ తో గానీ .. మహేశ్ బాబుతో గాని చేయవచ్చనే టాక్ కొన్నిరోజుల క్రితం వరకూ వినిపించింది. కానీ తాజాగా ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చేస్తోన్న సినిమా జనవరిలో విడుదలైపోతుంది. ఆ తరువాత త్రివిక్రమ్ ఫ్రీ అవుతాడు. ఇక రాజమౌళి సినిమా చేస్తోన్న ఎన్టీఆర్ కూడా జనవరికి ఫ్రీ అవుతాడట. అందువలన ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందనున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ ఇందుకు సంబంధించిన మాటలు జరిగిపోయాయని అంటున్నారు. ఇంతకు ముందు వీళ్ల కాంబినేషన్లో 'అరవింద సమేత' వచ్చిన సంగతి తెలిసిందే.