సినీ స్వర్ణయుగంలో ఉన్నందుకు సంతోషపడతాను: నటుడు శివకృష్ణ
- 'ముందడుగు' సినిమాతో స్టార్ డమ్ వచ్చింది
- ఎన్టీఆర్ గారు నేను ఆరాధించే దేవుడు
- నేను ఇష్టపడే నటి జయసుధ
నేను హీరోగా చేయడానికంటే, ఎన్టీఆర్ .. కృష్ణ .. శోభన్ బాబు గారు వంటి హీరోలతో కలిసి నటించడానికే ఎక్కువ ఆసక్తిని చూపించేవాడిని. ఎన్టీఆర్ గారి అభినయం అంటే నాకు విపరీతమైన ఇష్టం. ఆయనని నా దేవుడిగానే నేను భావిస్తాను. ఇక అప్పటి కథానాయికలలో జయసుధగారి నటన అంటే చాలా ఇష్టపడేవాడిని. తెలుగు చిత్రపరిశ్రమ స్వర్ణయుగం చూసినవారిలో నేనుండటం నాకు ఆనందాన్ని కలిగించే విషయం" అని చెప్పుకొచ్చారు.