ప్రజావేదిక అక్రమ కట్టడం అని యనమలకు తెలియదా?: మంత్రి అనిల్ కుమార్ యాదవ్
- రగులుతున్న ప్రజావేదిక వివాదం
- అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం
- యనమల వ్యాఖ్యలకు బదులిచ్చిన మంత్రి అనిల్
అక్రమ కట్టడం కాబట్టే ప్రజావేదికను కూల్చేయాలంటూ ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. చంద్రబాబు నివాసం కూడా అక్రమ కట్టడమేనని, అక్రమ నివాసాల్లో ఉండకూడదన్న విషయం యనమలకు తెలియదా? అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
అంతకుముందు, 70 శాతం పూర్తయిన పోలవరం నిర్మాణాలను కూడా కూల్చేస్తారా? అంటూ యనమల వ్యాఖ్యానించడంపైనా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బదులిచ్చారు. పోలవరం అక్రమ ప్రాజక్టు కాదన్న విషయాన్ని యనమల తెలుసుకోవాలని హితవు పలికారు.