ఉత్కంఠను రేపుతోన్న 'కల్కి' ట్రైలర్
- ప్రశాంత్ వర్మ నుంచి 'కల్కి'
- పోలీస్ ఆఫీసర్ పాత్రలో రాజశేఖర్
- ఈ నెల 28వ తేదీన విడుదల
'కొల్లాపూర్' ప్రాంతంలో జరిగే అరాచకాలు .. వాటిని అరికట్టడానికి హీరోగా 'కల్కి' రంగంలోకి దిగడాన్ని ఈ ట్రైలర్లో చూపించారు. 'హనుమంతుడు సాయం మాత్రమే చేస్తాడు .. యుద్ధం చేయవలసింది రాముడే' అనే డైలాగ్ బాగుంది. ఈ ట్రైలర్ ద్వారా సినిమాపై మరింత ఆసక్తిని పెంచడానికి టీమ్ చేసిన ప్రయత్నం ఫలిస్తుందనే చెప్పాలి. రాజశేఖర్ సరసన ఆదా శర్మ నటించిన ఈ సినిమా, తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకంతో అభిమానులు వున్నారు.