గేలి చేసిన నెటిజన్‌కు సమంత దిమ్మతిరిగే కౌంటర్!
- ‘ఓ బేబీ’ తమిళ్ వర్షన్‌కు డబ్బింగ్ చెప్పిన చిన్మయి
- డబ్బింగ్ చెప్పినందుకు సంతోషం వ్యక్తం చేసిన సామ్
- మూవీ పక్కా ప్లాప్ అంటూ నెటిజన్ ట్వీట్
దీనిపై స్పందించిన ఓ అమ్మాయి చాలా సంతోషంగా ఉందని, దర్శకురాలు నందినిరెడ్డి, సమంతల కాంబినేషన్‌పై అంచనాలు ఎక్కువగానే ఉంటాయని పేర్కొంది. ‘ఓ బేబీ’ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు పేర్కొంది. ఈ ట్వీట్లను చూసిన కిరు అనే అనే నెటిజన్, ‘ఫెమినిస్ట్లందరూ ఒకే దగ్గర ఉన్నారుగా.. మూవీ పక్కా ప్లాప్’ అని కామెంట్ చేశాడు. దీనిపై సామ్ స్పందిస్తూ, ‘హాహా.. థాంక్యూ.. ప్రపంచం ఒక మూర్ఖుడిని కలిసింది.. మూర్ఖుడు ప్రపంచాన్ని కలిశాడు’ అని సమాధానమిచ్చింది.