అందుకే కృష్ణవంశీ వాళ్లను హీరోలను చేశాడు: నటుడు ఉత్తేజ్
- కృష్ణవంశీ చెన్నై వీధుల్లో తిరిగాడు
- భోజనానికి డబ్బులు లేక ఇబ్బందులు పడ్డాడు
- ఆయన బ్రహ్మాజీని మరిచిపోలేదు
"సినిమాల పట్ల ఆసక్తితో చెన్నైకి వెళ్లిన కృష్ణవంశీ చాలా ఇబ్బందులు పడ్డాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం సంపాదించుకోవడం కోసం చెన్నై రోడ్లపై తిరిగాడు. భోజనానికి కూడా డబ్బులు లేక నానా కష్టాలు పడుతోన్న సమయంలో ఆయనని మెస్ కి తీసుకెళ్లి బ్రహ్మాజీ భోజనం పెట్టించాడట. ఆ కృతజ్ఞత కారణంగానే ఆయన 'సిందూరం'లో బ్రహ్మాజిని ఒక హీరోగా తీసుకున్నారు. ఇక ఎప్పుడు చూసినా రవితేజ అల్లరి చేస్తూ కనిపించడంతో, ఆయనలోని ఎనర్జీ నచ్చేసి అదే సినిమాలో మరో హీరోగా తీసుకున్నారు" అంటూ చెప్పుకొచ్చాడు.