యూత్ ను ఆకట్టుకునేలా 'హిప్పీ' నుంచి లిరికల్ వీడియో సాంగ్
- టీఎన్ కృష్ణ దర్శకత్వం
- కీలకమైన పాత్రలో జేడీ చక్రవర్తి
- తెలుగు .. తమిళ భాషల్లో విడుదల
"ఎవతివే .. ఎవతివే .. ఎదను పట్టి వదలవే. ఎవతివే .. ఎవతివే .. కళ్లలోంచి కదలవే .. " అంటూ ఈ పాట సాగుతోంది. అనంత్ శ్రీరామ్ సాహిత్యం .. నివాస్ కె. ప్రసన్న సంగీతం .. కార్తీక్ ఆలాపన యూత్ ను ఆకట్టుకునేలా వున్నాయి. జేడీ చక్రవర్తి .. వెన్నెల కిషోర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.