తమన్నాతో కలిసి నటించాలని ఉందన్న కాజల్
- తమన్నా .. కాజల్ మంచి స్నేహితులు
- కాజల్ తాజా చిత్రంగా రానున్న 'సీత'
- 'ఖామోషి'తో పలకరించనున్న తమన్నా
తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ, కాజల్ తో కలిసి నటించాలని ఉందని చెప్పింది. ఈ విషయం తన దృష్టికి రావడంతో కాజల్ కూడా స్పందించింది. తమన్నాతో కలిసి నటించడానికి తాను సిద్ధంగా వున్నానని అంది. తెలుగు .. తమిళ భాషల్లో ఈ ఇద్దరి కాంబినేషన్లో ఏదైనా ప్రాజెక్టును ఎవరైనా సెట్ చేస్తారేమో చూడాలి. అన్నట్టు తమన్నా తాజా హిందీ చిత్రంగా రూపొందిన 'ఖామోషి' ఈ నెల 17న విడుదల కానుంది. కాజల్ తాజా చిత్రంగా నిర్మితమైన 'సీత' ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.