చైతూ, అజయ్ భూపతి మూవీ ఇప్పట్లో లేనట్టే!
- 'ఆర్ ఎక్స్ 100'తో హిట్
- ఇంతవరకూ సెట్ కానీ కొత్త ప్రాజెక్టు
- ప్రయత్నాల్లోనే వున్న అజయ్ భూపతి
ఆయన తాజా చిత్రం చైతూ హీరోగా ఉండొచ్చనే వార్త కొన్ని రోజులుగా వినిపిస్తోంది. చైతూతో సినిమా కూడా ఇప్పట్లో లేనట్టేనని తెలుస్తోంది. ప్రస్తుతం చైతూ 'వెంకీమామ' సినిమాతో బిజీగా వున్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన సొంత బ్యానర్లో 'రామరాజు' అనే ప్రాజెక్టు చేయనున్నట్టు సమాచారం. అందువలన చైతూ అందుబాటులో లేనట్టేనని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అజయ్ భూపతి ఏ హీరోను సెట్ చేసుకుంటాడో చూడాలి.