100 కోట్ల బడ్జెట్ తో 'కాంచన 4'
- తెలుగులో 'కాంచన 3'కి భారీ హిట్
- 'కాంచన 4' కి సన్నాహాలు
- 3డీ ఎఫెక్ట్ తో తెరపైకి
'కాంచన 4' సినిమాను నిర్మించడానికి సన్ పిక్చర్స్ వారు ముందుకు వచ్చారనేది తాజా సమాచారం. 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించడానికి వాళ్లు తమ సంసిద్ధతను వ్యక్తం చేశారనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. ఈ సినిమాను '3డీ'లో చేయాలనీ .. భారీస్థాయిలో గ్రాఫిక్స్ ను ఉపయోగించాలని .. భారీ తారాగణాన్ని తీసుకోవాలని అనుకోవడం వలన, ఈ సినిమాకి ఈ స్థాయి ఖర్చు అవుతుందని అంటున్నారు. హారర్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమాపైనే లారెన్స్ అభిమానులు ప్రత్యేక దృష్టి పెట్టారు.