తెలుగు రాష్ట్రాల్లో 'కాంచన 3' మూడు రోజుల వసూళ్లు
- లారెన్స్ ప్రధాన పాత్రధారిగా 'కాంచన 3'
- హారర్ తో పాటు కామెడీకి ప్రాధాన్యత
- మాస్ ఏరియాల్లో మరిన్ని వసూళ్లు
హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో లారెన్స్ నటన హైలైట్ అని చెబుతున్నారు. హారర్ తో పాటు కామెడీకి కూడా సమానమైన ప్రాధాన్యత ఇవ్వడం వలన, ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తోందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. సాధారణంగా లారెన్స్ సినిమాల్లో మాస్ అంశాలు ఎక్కువగా ఉంటాయి. అలా 'కాంచన 3'లోని మాస్ అంశాలు ఈ సినిమాకు బాగా కలిసొచ్చాయని అంటున్నారు. వేసవి సెలవుల కారణంగా ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.