కష్టాలు దాటి ఈ స్థాయికి వచ్చారు కాబట్టే రాజకీయాలను ఎంచుకున్నారు: ప్రకాశ్‌రాజ్ భార్య ట్వీట్
- నటించి డబ్బులు సంపాదించడం చాలా సులువు
- విభిన్నమైన మార్గం ఎంచుకున్నారు
- పేద ప్రజల బాధ ఆయనకు తెలుసు
‘నటించి డబ్బులు సంపాదిస్తూ తన కుటుంబాన్ని చూసుకోవడం ఆయనకు చాలా సులభమైన పని. కానీ ఆయన విభిన్నమైన మార్గం ఎంచుకున్నారు. కష్టాలు దాటి ఈ స్థాయికి వచ్చారు కాబట్టే ఆ దారి ఎంచుకున్నారు. పేద ప్రజల బాధ ఆయనకు తెలుసు’ అని పోనీ ట్వీట్లో పేర్కొన్నారు.
అలాగే తన భర్తకు సంబంధించిన ఓ ఫొటోని షేర్ చేసిన పోనీ, ‘2015లో తీసిన ఫొటో ఇది. మీడియాను పిలిచి ఆ గ్రామం ఎంత అభివృద్ధి చెందిందో ఎందుకు చూపించవు? అని ప్రతిసారి నేను ఆయన్ను అడుగుతుంటా’ అని ట్వీట్ చేశారు. దీనికి తాను సంతృప్తి కోసం చేస్తున్నానని, చూపించుకోవడం కోసం కాదని ప్రకాశ్‌రాజ్ తనకు చెబుతుంటారని పోనీ పేర్కొన్నారు.