చియాన్ విక్రమ్ బర్త్ డే స్పెషల్ గా 'కడరమ్ కొండన్' మేకింగ్ వీడియో
- విక్రమ్ తాజా చిత్రంగా 'కడరమ్ కొండన్'
- ముఖ్య పాత్రల్లో పూజా కుమార్ .. అక్షర హాసన్
- తెలుగులోను విడుదల చేసే ఆలోచన
ఈ రోజున విక్రమ్ పుట్టినరోజు .. 53వ వసంతంలోకి ఆయన అడుగుపెట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. విక్రమ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దర్శకుడు రాజేశ్ ఎం.సెల్వ ఈ మేకింగ్ వీడియోను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ మేకింగ్ వీడియో విక్రమ్ అభిమానులను ఫిదా చేస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమాలో పూజా కుమార్ .. అక్షర హాసన్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు.