కర్ణాటకలో మా ఎత్తుగడలు ఫలిస్తున్నాయి: బీజేపీ నేత మురళీధరరావు
- కర్ణాటకలో చంద్రబాబుకు ఆదరణ తగ్గింది
- తెలుగు రాజకీయాలను కన్నడ ప్రజలు ఒప్పుకోరు
- మా వ్యూహం కారణంగా కుమారస్వామి మాండ్యాకే పరిమితమయ్యారు
కర్ణాటకలో తమ ఎత్తుగడలు ఫలిస్తున్నాయని మురళీధరరావు అన్నారు. తమ వ్యూహం కారణంగా ముఖ్యమంత్రి కుమారస్వామి మాండ్యా నియోజకవర్గం నుంచి బయటకు రావడం లేదని చెప్పారు. ఈవీఎంలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. పాకిస్థాన్ లోని బాలాకోట్ పై జరిపిన దాడులు బీజేపీకి లాభిస్తాయని చెప్పారు. రోజురోజుకు బీజేపీకి ఆదరణ పెరుగుతోందని... మోదీ మళ్లీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు.