నేను పుట్టినప్పుడు మా నాన్న నన్ను చూడటానికి హాస్పిటల్ కి రాలేదు: రేణు దేశాయ్
- మగపిల్లాడు పుట్టాలని నాన్న అనుకున్నారు
- నేను పుట్టడం అమ్మకి కూడా సంతోషాన్ని కలిగించలేదు
- నన్ను కన్నందుకు గర్వంగా ఉందని నాన్న అన్నారు
నా కంటే ముందు మా అక్కయ్య వుంది .. ఆమె తరువాత అబ్బాయి పుట్టాలని నాన్నగారు అనుకున్నారు .. కానీ నేను పుట్టాను .. మళ్లీ అమ్మాయే పుట్టిందని తెలిసి ఆయన రాలేదు. మళ్లీ అమ్మాయే పుట్టడమనేది మా అమ్మకి కూడా సంతోషాన్ని కలిగించలేదు. ఒక రకంగా నేను పుట్టడమనేది అమ్మానాన్నలిద్దరికీ బాధను కలిగించిన విషయం. ఆ తరువాత నేను ఎదిగిన తీరు .. నా ఆలోచనా విధానం చూసి, నన్ను కన్నందుకు గర్వంగా ఉందని మా నాన్నగారు అన్నారు" అంటూ చెప్పుకొచ్చారు.