త్రివిక్రమ్ .. బన్నీ సినిమా టైటిల్ 'అలకనంద'?
- కథలో మార్పులు చేసిన త్రివిక్రమ్
- తల్లిపాత్రకి పెరిగిన ప్రాధాన్యత
- 'అలకనంద' పాత్రలో టబు
అయితే ఆల్రెడీ తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో 'సన్నాఫ్ సత్యమూర్తి' చేసి ఉండటం వలన, తల్లీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో తాజా చిత్రం కథను మార్చినట్టుగా సమాచారం. తల్లి పాత్ర ప్రాధాన్యతను సంతరించుకోవడం వల్లనే, ఆ పాత్రకి గాను 'టబు'ను తీసుకున్నారని అంటున్నారు. తల్లి పాత్ర వైపు నుంచి టైటిల్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే, 'అలకనంద' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ఈ టైటిల్ ను బన్నీకి త్రివిక్రమ్ చెప్పడం జరిగిందనీ, బన్నీ ఓకే అంటే ఖాయమైపోతుందని చెబుతున్నారు. బన్నీ ఏమంటాడో చూడాలి మరి.