విజయ్ కోసం 6 కోట్లతో ఫుట్ బాల్ స్టేడియం సెట్
- విజయ్ హీరోగా సెట్స్ పై 63వ చిత్రం
- కథానాయికగా నయనతార
- విజయ్ పుట్టినరోజున ఫస్టులుక్
ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను ఈవీపీ స్టూడియోస్ లో ప్లాన్ చేశారు. త్వరలో ఈ షెడ్యూల్ షూటింగ్ మొదలై, దాదాపు 50 రోజుల పాటు నాన్ స్టాప్ గా కొనసాగనుంది. ఈ స్టూడియోలో భారీస్థాయిలో ఫుట్ బాల్ సెట్ ను నిర్మిస్తున్నారట. ఇందుకోసం 6 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. విజయ్ పుట్టినరోజైన జూన్ 22వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను 'దీపావళి'కి రిలీజ్ చేయనున్నారు.