నాని మల్టీ స్టారర్ కి అదే టైటిల్ ను ఫిక్స్ చేశారు
- ఇంద్రగంటి దర్శకత్వంలో నాని
- ఇద్దరి కాంబినేషన్లో మూడో సినిమా
- త్వరలోనే సెట్స్ పైకి
ఈ సినిమాలో సుధీర్ బాబు కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. ఇంతకుముందు ఇంద్రగంటి మోహనకృష్ణ .. సుధీర్ బాబుకి కూడా 'సమ్మోహనం' వంటి హిట్ ఇచ్చాడు. నాని - సుధీర్ బాబు కాంబినేషన్లోని సినిమాకి 'వ్యూహం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అదే టైటిల్ ను ఖరారు చేశారనేది తాజా సమాచారం. ప్రస్తుతం మిగతా నటీనటులను ఎంపిక చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇంద్రగంటి మోహనకృష్ణతో కలిసి నాని హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి.