'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ నుంచి టీజర్ రిలీజ్ .. డోస్ పెంచిన సందీప్ వంగా
- 'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ గా 'కబీర్ సింగ్'
- మరింత గ్లామరస్ గా కైరా అద్వానీ
- జూన్ 21వ తేదీన భారీ విడుదల
తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. దర్శకుడు సందీప్ రెడ్డి .. బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా, మరికొంత డోస్ పెంచినట్టు ఈ టీజర్ ను చూస్తే అర్థమవుతోంది. కైరా అద్వాని మరింత గ్లామరస్ గా కనిపిస్తోంది. జూన్ 21వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. హిందీలోనూ ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి