నాగబాబుగారి వల్లనే 'జబర్డస్త్'కి నిండుదనం వచ్చింది: ముక్కు అవినాష్
- నాగబాబుగారు అందుకే రాలేదు
- 'జబర్దస్త్'కి జడ్జిగా ఆయనే వుంటారు
- ప్రేక్షకుల కోరిక కూడా అదే
'జబర్డస్త్' జడ్జి సీట్లో నాగబాబుగారు లేకపోతే ఏదో వెలితిగా ఉందనీ .. ఆయన వుంటేనే బాగుంటుందని చాలామంది కామెంట్స్ పెట్టారు. నిజంగానే ఆ సీట్లో నాగబాబు గారు ఉంటేనే కార్యక్రమానికి ఒక నిండుదనం వస్తుంది. ఆయన ఒక తండ్రిలా మాకు సలహాలు సూచనలు ఇస్తుంటారు. ఇంటి నుంచి భోజనం తెప్పించి అందరికీ ముద్దలు కలిపి పెడతారు. తాను ఓ మెగా బ్రదర్ ను అనే విషయం మరిచిపోయి మాలో కలిసిపోతారు .. అది మేం చేసుకున్న అదృష్టం" అని చెప్పుకొచ్చాడు.