'మహర్షి' నుంచి ఫస్టు లిరికల్ సాంగ్ .. అదరగొట్టేసిన దేవిశ్రీ
- హుషారైన దేవిశ్రీ బీట్
- ఆకట్టుకుంటోన్న శ్రీమణి సాహిత్యం
- యూత్ కి కనెక్ట్ అయ్యే స్నేహగీతం
'స్నేహం అంటే పుస్తకాలు చెప్పని పాఠం .. కన్నవాళ్లు ఇవ్వలేని ఆస్తి' అంటూ శ్రీమణి రాసిన సాహిత్యం బాగుంది. ఈ పాటకు దేవిశ్రీ కట్టిన బాణీ .. ఆయన ఆలాపన యూత్ ను ఆకట్టుకునేలా వున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే దేవిశ్రీ అదరగొట్టేశాడు. చాలా రోజుల తరువాత కాలేజ్ స్టూడెంట్స్ కి సరదాగా .. సంతోషంగా .. సందడిగా సాగిపోయే ఒక మంచి పాట దొరికిందనే చెప్పుకోవాలి. 'మహర్షి' నుంచి వచ్చిన ఈ ఫస్టు లిరికల్ సాంగ్ మంచి మార్కులు కొట్టేసిందనే చెప్పాలి.