'సూర్యకాంతం'తో పరిచయమవుతోన్న మరో కొత్త నాయిక
- 'సూర్యకాంతం' పాత్రలో నిహారిక
- మరో నాయికగా పెర్లిన్ భెసానియా
- 'పూజ' పాత్ర నాకు బాగా నచ్చింది
ఈ ముంబై ముద్దుగుమ్మ చాలా యాడ్స్ లో చేసినట్టుగా సమాచారం. తెలుగులో మాత్రం అమ్మడికి ఇదే తొలి సినిమా. తాజాగా ఈ సుందరి స్పందిస్తూ .. 'నిజానికి నాకు తెలుగు రాదు .. హిందీలో డైలాగ్స్ రాసుకుని చెప్పాను. ఈ సినిమాలో నేను చేసిన 'పూజ' పాత్ర నాకు మంచి క్రేజ్ తీసుకొస్తుందని భావిస్తున్నాను. నిహారికతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా విడుదలకాకముందే వరుస అవకాశాలు వస్తుండటం సంతోషాన్ని కలిగిస్తోంది" అని చెప్పుకొచ్చింది.