చిరంజీవిగారితో నటించాలనే కోరిక నెరవేరింది: నిహారిక
- హీరోయిన్ గా ఎక్కువ కాలం ఉండటానికి రాలేదు
- పెద్ద హీరోల సరసన నటించాలనుకోలేదు
- నాకున్న సమయం చాలా తక్కువ
స్టార్ హీరోల సరసన అవకాశాల కోసం ఎదురుచూడటం లేదు. ఎందుకంటే 30 యేళ్లు వచ్చేలోగానే పెళ్లి చేసేస్తామని ఇంట్లో వాళ్లు చెప్పేశారు. అందువలన నాకున్న సమయం చాలా తక్కువ. ఈ లోగా నా మనసుకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాను. నేను ఎలాంటి కథలకి .. పాత్రలకి సెట్ అవుతానో, అలాంటి వాటితోనే దర్శక నిర్మాతలు వస్తున్నారు. పెద్ద హీరోల జోడీగా చేయమని ఇంతవరకూ ఎవరూ అడగలేదు కూడా. అందరికంటే పెద్ద హీరో అయిన చిరంజీవిగారి సినిమాలో చేయాలని ఉండేది. 'సైరా' సినిమాతో ఆ కోరిక కూడా నెరవేరింది .. అంతకన్నా ఇంకా ఏం కావాలి?" అని చెప్పుకొచ్చింది.