రవితేజతో మరోమారు జోడీ కడుతోన్న కాజల్
- రవితేజ తాజా చిత్రంగా 'డిస్కోరాజా'
- తదుపరి సినిమాగా 'కనకదుర్గ'
- త్వరలోనే పట్టాలెక్కనున్న ప్రాజెక్టు
ఈ సినిమాకి 'కనకదుర్గ' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేయవచ్చని అంటున్నారు. కథాపరంగా ఈ సినిమాలో ఇద్దరు నాయికలు వుంటారు. ఒక కథానాయికగా ఇంతకుముందే కేథరిన్ ను తీసుకున్నారు. మరో కథానాయికగా కాజల్ ను ఎంపిక చేసుకున్నారనేది తాజా సమాచారం. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'సారొచ్చారు' అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. తాజా చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.