త్రిషను వెతుక్కుంటూ వచ్చిన భారీ ఛాన్స్?
- హిందీలో హిట్ కొట్టిన 'బద్లా'
- తెలుగు .. తమిళ భాషల్లో రీమేక్
- త్రిషను ఖరారు చేసే ఛాన్స్
తనకి తెలియకుండా ఒక హత్య కేసులో చిక్కుకున్న తాప్సీని కాపాడటానికి ఒక లాయర్ గా అమితాబ్ రంగంలోకి దిగుతాడు. ఆ తరువాత చోటుచేసుకునే అనూహ్యమైన మలుపులతో ఈ కథ కొనసాగుతుంది. తాప్సీ పాత్ర కోసం త్రిషను తీసుకునే ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయని అంటున్నారు. ఇటీవల '96' హిట్ తో త్రిష క్రేజ్ మళ్లీ ఒక్కసారిగా పెరిగిపోయింది. అందువల్లనే ఈ పాత్ర కోసం ఆమెను ఎంచుకున్నారని చెబుతున్నారు. త్రిష ఎంపిక దాదాపు ఖరారైపోతుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.